పార్ట్ 3
పార్వతి ఈజ్ గోయింగ్ టు హైదరాబాద్.
రామనాథ శర్మ గారి ఒక్కొక్క మాట సమ్మెట పోట్ల లాగా ఇంకా అందరి మనసులని తొలిచేస్తున్నాయి. ఇంట్లో జరిగిన తతంగం ఏమీ తెలియని పార్వతి ఎప్పటిలాగే అల్లరి చిల్లరగా చిలిపి పనులు చేస్తూనే ఉంది. మెల్లిగా రెండ్రోజులు గడిచిపోయ్యాయి. బాగా ఆలోచించుకున్న గణపతయ్య ఒక రోజు భోజనాల వేళ తన మనసులోని విషయాన్ని అందరిముందూ పెద్ద కొడుక్కి చెప్పాడు. ఎప్పటి లాగానే పారు తన తోటి స్నేహితురాళ్ళతో ఏ షికారుకో బయలుదేరి యమ బిజీగా ఉండడంచేత ఇంట్లో లేదు.
శంకరా, బాగా ఆలోచించిన్తరువాత, నేనొక నిర్ణయానికొచ్చాను. మన పారుని పట్నం పంపిచేద్దాం. ఇంజనీరింగు ఎలాగూ పూర్తి చేసింది కాబట్టి, హైదరాబాదులో ఉన్న మన మోహన్ తో మాట్లాడి, వాడికి తెలిసిన ఏదైనా కంపెనీలో పారుకి ఉద్యోగం వచ్చేలా చూస్తా. ఒక సంవత్సరం పాటు పారు మోహన్ వాళ్ళింట్లోనే ఉండనీ. మోహన్ కూతురు శైలజ మన పారుకి బాగా తెలుసు కదా, ఒకరికొకరు తోడుగా ఉంటారు మరి. అప్పుడప్పుడూ మనమే హైదరాబాదుకి వెళ్లి పారుని కలిసొద్దాము. ఇక అంతా ఆ మల్లన్న దయ. ఏమంటావు రా?
అనడానికేమీ లేదు నాన్నా. మీరు ఏది చెప్పినా పారు మంచికోసమేనని అందరకీ తెలుసు. మాకేమీ అభ్యంతరం లేదు. కానీ పారు దీనికి ఒప్పుకుంటుందా అనీ...
దానికి నేను సర్దిచెపుతాను కదరా పెద్దోడా. నువ్వేమీ దిగులు పడకుండా నిశ్చింతగా ఉండు. అది పట్నం వెళ్లడానికి ఏర్పాట్లు చేస్తూ ఉండండని పెద్ద పార్వతమ్మ భరోసా ఇచ్చింది. కానీ ఒక్క విషయం చెబుతున్నాను జాగ్రత్తగా వినండి... హైదరాబాదుకి వెళ్లనని నానా రభసా చేస్తుంది పార్వతి. ఇంట్లో ప్రతి ఒక్కరూ నా మాటమీదే ఉండాలి కాని, దీని మాటల్లో పది గారాబం చేసారో, ఇంక నేనూరుకునేదిలేదు. తెల్చిచేప్పేసింది పెద్ద పార్వతమ్మ. అవునన్నట్టుగా తలూపారు అందరూ.
ఇదంతా ఏమీ తెలియని పారు తాపీగా సాయంకాలం ఇంటికి చేరింది. వచ్చీ రాగానే బామ్మని వాటేసుకుని రోజంతా వెలగబెట్టిన విషయాలన్నీ పూస గుచ్చినట్టుగా చెబుతూ ఉంది. ఓపికగా విన్నతరువాత మెల్లిగా చెప్పాలనుకున్నదంతా మూడు ముక్కల్లో చెప్పెసింది పెద్ద పార్వతమ్మ (అయితే శర్మ గారు చెప్పిందల్లా కాకుండా, చదువుకున్నందుకు ఉద్యోగం చెయ్యాలన్నట్టుగా!). అనుకున్నట్టుగానే పారు కోపంగా కాదు పోమ్మంటూ తాతయ్య దెగ్గరికి పరుగు తీసింది. తాతయ్య కూడా అదే మాట చెప్పడంతో ఇంకా ఉడికిపొయ్యింది పారు. అలా ఇంట్లో అందరూ ఒకే తాటిపై ఉండడంచేత అలిగి బుంగ మూతి పెట్టుకుని తన గదికి వెళ్ళిపోయింది కళ్ళల్లో నీళ్ళతో.
మరుసటి రోజు కూడా పరిస్థితి ఏమాత్రం మారకపోవడంచేత, ఇక వేరేదారిలేదని గ్రహించిన పారు, అమ్మమ్మ దెగ్గరికి వెళ్లి తాను హైదరాబాదుకి వెల్తాననీ, అయితే ప్రతీ వారం తనను చూడడానికి అందరూ రావాలనీ, బస్సుల్లో తిరగననీ, ఒక స్కూటీ బండి కావాలనీ, ఇంకో పదహారు కండీషన్లు పెట్టింది. అన్నింటికీ వప్పుకునే సరికి పారు సరేనంది. ఇక మరుసట్రోజే హైదరాబాదు ప్రయాణానికి ఇంటిల్లిపాదీ సిద్ధమయ్యింది.
టు బి కంటిన్యూడ్...
Monday, May 25, 2009
చాప్టర్ టూ: మిద్దెల పార్వతి (పాపులర్లీ నోన్ యాజ్ "పారు") - సివంగి ఆఫ్ పెంబర్తి.
పార్ట్ 2
పార్వతి విధి.
హిందూ సాంప్రదాయం ప్రకారం, మంచి పని మొదలుబెట్టే ముందు పంచాంగంలో ముహూర్తం చూసి, మంచి అనువైన సమయంలో పని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ పనే చేసాడు శర్మ. రాహుకాలం దాటిపోయినందువల్ల ఆయన ఆర్డర్ ప్రకారం శంకర్ రావు సందుగలో దాచి ఉంచిన పారు జాతక పత్రాన్ని తీసుకొచ్చాడు. ఆపాటికే సిద్ధి రాములు గారు తన దెగ్గిర ఉన్న ఆయా పెళ్ళికొడుకుల ఫోటోలు, బయో-డేటాలు, జాతక ప్రతులు పక్కన ఉన్న చెక్కబల్ల మీద పరిచి ఉంచాడు.
ఎంతో సందడిగా ఉండే ఇల్లంతా చాలా గంభీరంగా మారిపోయింది. ఒక పక్క మూలుగుతూ ఉన్న గణపతయ్య కాళ్ళు పిసుకుతూ, ఒకింత బాధతోనూ మరింత ఉత్కంఠతో రామనాథ శర్మ గారు ఏమి చెబుతారో అని వేచిఉంది పెద్ద పార్వతమ్మ. ఇక మిగితా వాళ్ల సంగతి సరే సరి. నిమిషాలు బరువుగా గడుస్తున్నాయి. కిర్రు కిర్రు మంటూ తిరుగుతున్న ఖైతాన్ ఫ్యాను, బయట కొట్టంలో ఉన్న గేదెల అరుపులూ, పక్షుల కిల కిలా రావాలు అన్నీ ఎంతో స్పష్టంగా వినబడుతున్నాయి. మామూలుగా కట్టే కొట్టే తెచ్చె అన్నట్టుగా ఒక్క నిమిషంలో సమాధానం చెప్పే శర్మ గారు, ఇవ్వాళ్ళ ఎందుకింత సమయం తీస్కుంతున్నారో ఎవ్వరికీ బోధ పడలేదు. ఈ నిశ్శబ్దం భరించలేకుండా ఉంది అందరికీ.
ఇక ఆగలేక సిద్ధి రాములు గారు గొంతు సవరించుకుని శర్మ గారిని ఏదో అడగబొయ్యాడు... ఇది ముందే గమనించి శర్మ గారు తనని డిస్టర్బ్ చెయ్యొద్దని కోపంగా ఒక్క చూపు విసిరేశాడు. ఎందుకొచ్చిన తంటా అని నోరు మెదపకుండా కూర్చునాడు సిద్ధి రాములు. ఇంకో పది నిమిషాలు గడిచింతరువాత పక్కన ఉంచిన మంచినీళ్ళ గ్లాసు దించకుండా తాగేసి, తన కండువాతో చెమటలుపట్టిఉన్న మొహాన్ని తుడుచుకుని, అందరి వంకా ఒకమారు గంభీరంగా చూసి, తన పెద్ద కళ్ళద్దాలు సవరించుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు రామనాథ శర్మ.
చూడండి గణపతయ్య గారూ, మా తండ్రిగారైన శ్రీ శ్రీ రఘునాథ శర్మ గారు రాసిన జాతకం ఇది. వారు రాసిన జాతకానికి తిరుగులేదని మనకందరకూ తెలిసిన విషయమే. అయితే ఒక్క విషయం, వారు రాసిన జాతకంలో కొన్ని ముఖ్యమైన విషయాలను సూటిగా చెప్పకుండా, సంస్కృతంలో రాసిన శ్లోకాలలో నిక్షిప్తం చేసేవారు. అలాంటి రెండు శ్లోకాలు మన పారు జాతకంలో కూడా రాశారు. సమయం సందర్భానుసారం, ఏదోవిధంగా ఆ శ్లోకాల అర్థం మీకు ఎవ్వరివల్లనో విధి అనుసారం, తెలవాల్సి ఉంటుంది. ఈరోజు, ఆ మహానుభావుల ఆశీర్వాదబలంతో, ఈ భాగ్యం నాకు దక్కింది.
వినబోయ్యే విషయాలు మీకు నచ్చావచ్చు, నచ్చకపోవచ్చు. కానీ, ఆ విషయాలు తు.చ తప్పకుండా జరిగి తీరుతాయి. గుండె నిబ్బరం చేసుకుని వినండి. గణపతయ్య గారూ, పెద్ద పార్వతమ్మ గారూ, మన పారు పుట్టిన వేలా విశేషం ఎంతో టుమైనది. జాతకరీత్యా, పారు ఎంతో అదృష్టవంతురాలు. అయితే, పారు ఇరవ్వైయో ఏట దాటింద్దేగ్గరనించీ, మీరు ఆశించినట్టుగా ఏవీ జరగవు. అందులో ముఖ్యంగా మీరు ఇప్పుడు తెలుసుకోవలసిన విషయాలు మూడు... మొదటిది, మన పారు తొందర్లోనే ఒక పెద్ద గండాన్ని ఎదురుకోబోతుంది. ఇది వినగానే ఇంట్లోవాళ్ళ పై ప్రాణాలు పైనే పొయ్యాయి.యింతలోనే శర్మ గారు చెప్పడం మొదలుబెట్టారు. కానీ అదృష్టవశాత్తూ, పారుకి ఏమీ కాదు. మంచే జరుగుతుంది.
రెండవది... పారు ఇరవయ్యో ఏట నించి ఇరవ్వై రెండోఏడు నిండే వరకు, కుటుంబం నుంచి దూరంగా ఉండాలి. ఒకవేళ తను ఈ వూళ్ళోనే ఉంటే, మీ యింటికి అరిష్టం. ఆఖరిగా, మన పారుకు కళ్యాణయోగం ఉంది. కానీ, మీరు చూసిన వరుడితో మాత్రం కాదు.

Subscribe to:
Posts (Atom)