పార్ట్ 2
పార్వతి విధి.
హిందూ సాంప్రదాయం ప్రకారం, మంచి పని మొదలుబెట్టే ముందు పంచాంగంలో ముహూర్తం చూసి, మంచి అనువైన సమయంలో పని ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ పనే చేసాడు శర్మ. రాహుకాలం దాటిపోయినందువల్ల ఆయన ఆర్డర్ ప్రకారం శంకర్ రావు సందుగలో దాచి ఉంచిన పారు జాతక పత్రాన్ని తీసుకొచ్చాడు. ఆపాటికే సిద్ధి రాములు గారు తన దెగ్గిర ఉన్న ఆయా పెళ్ళికొడుకుల ఫోటోలు, బయో-డేటాలు, జాతక ప్రతులు పక్కన ఉన్న చెక్కబల్ల మీద పరిచి ఉంచాడు.
ఎంతో సందడిగా ఉండే ఇల్లంతా చాలా గంభీరంగా మారిపోయింది. ఒక పక్క మూలుగుతూ ఉన్న గణపతయ్య కాళ్ళు పిసుకుతూ, ఒకింత బాధతోనూ మరింత ఉత్కంఠతో రామనాథ శర్మ గారు ఏమి చెబుతారో అని వేచిఉంది పెద్ద పార్వతమ్మ. ఇక మిగితా వాళ్ల సంగతి సరే సరి. నిమిషాలు బరువుగా గడుస్తున్నాయి. కిర్రు కిర్రు మంటూ తిరుగుతున్న ఖైతాన్ ఫ్యాను, బయట కొట్టంలో ఉన్న గేదెల అరుపులూ, పక్షుల కిల కిలా రావాలు అన్నీ ఎంతో స్పష్టంగా వినబడుతున్నాయి. మామూలుగా కట్టే కొట్టే తెచ్చె అన్నట్టుగా ఒక్క నిమిషంలో సమాధానం చెప్పే శర్మ గారు, ఇవ్వాళ్ళ ఎందుకింత సమయం తీస్కుంతున్నారో ఎవ్వరికీ బోధ పడలేదు. ఈ నిశ్శబ్దం భరించలేకుండా ఉంది అందరికీ.
ఇక ఆగలేక సిద్ధి రాములు గారు గొంతు సవరించుకుని శర్మ గారిని ఏదో అడగబొయ్యాడు... ఇది ముందే గమనించి శర్మ గారు తనని డిస్టర్బ్ చెయ్యొద్దని కోపంగా ఒక్క చూపు విసిరేశాడు. ఎందుకొచ్చిన తంటా అని నోరు మెదపకుండా కూర్చునాడు సిద్ధి రాములు. ఇంకో పది నిమిషాలు గడిచింతరువాత పక్కన ఉంచిన మంచినీళ్ళ గ్లాసు దించకుండా తాగేసి, తన కండువాతో చెమటలుపట్టిఉన్న మొహాన్ని తుడుచుకుని, అందరి వంకా ఒకమారు గంభీరంగా చూసి, తన పెద్ద కళ్ళద్దాలు సవరించుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు రామనాథ శర్మ.
చూడండి గణపతయ్య గారూ, మా తండ్రిగారైన శ్రీ శ్రీ రఘునాథ శర్మ గారు రాసిన జాతకం ఇది. వారు రాసిన జాతకానికి తిరుగులేదని మనకందరకూ తెలిసిన విషయమే. అయితే ఒక్క విషయం, వారు రాసిన జాతకంలో కొన్ని ముఖ్యమైన విషయాలను సూటిగా చెప్పకుండా, సంస్కృతంలో రాసిన శ్లోకాలలో నిక్షిప్తం చేసేవారు. అలాంటి రెండు శ్లోకాలు మన పారు జాతకంలో కూడా రాశారు. సమయం సందర్భానుసారం, ఏదోవిధంగా ఆ శ్లోకాల అర్థం మీకు ఎవ్వరివల్లనో విధి అనుసారం, తెలవాల్సి ఉంటుంది. ఈరోజు, ఆ మహానుభావుల ఆశీర్వాదబలంతో, ఈ భాగ్యం నాకు దక్కింది.
వినబోయ్యే విషయాలు మీకు నచ్చావచ్చు, నచ్చకపోవచ్చు. కానీ, ఆ విషయాలు తు.చ తప్పకుండా జరిగి తీరుతాయి. గుండె నిబ్బరం చేసుకుని వినండి. గణపతయ్య గారూ, పెద్ద పార్వతమ్మ గారూ, మన పారు పుట్టిన వేలా విశేషం ఎంతో టుమైనది. జాతకరీత్యా, పారు ఎంతో అదృష్టవంతురాలు. అయితే, పారు ఇరవ్వైయో ఏట దాటింద్దేగ్గరనించీ, మీరు ఆశించినట్టుగా ఏవీ జరగవు. అందులో ముఖ్యంగా మీరు ఇప్పుడు తెలుసుకోవలసిన విషయాలు మూడు... మొదటిది, మన పారు తొందర్లోనే ఒక పెద్ద గండాన్ని ఎదురుకోబోతుంది. ఇది వినగానే ఇంట్లోవాళ్ళ పై ప్రాణాలు పైనే పొయ్యాయి.యింతలోనే శర్మ గారు చెప్పడం మొదలుబెట్టారు. కానీ అదృష్టవశాత్తూ, పారుకి ఏమీ కాదు. మంచే జరుగుతుంది.
రెండవది... పారు ఇరవయ్యో ఏట నించి ఇరవ్వై రెండోఏడు నిండే వరకు, కుటుంబం నుంచి దూరంగా ఉండాలి. ఒకవేళ తను ఈ వూళ్ళోనే ఉంటే, మీ యింటికి అరిష్టం. ఆఖరిగా, మన పారుకు కళ్యాణయోగం ఉంది. కానీ, మీరు చూసిన వరుడితో మాత్రం కాదు.
టు బి కంటిన్యూడ్...
Subscribe to:
Post Comments (Atom)
Hi,
ReplyDeleteI saw your image on flickr about a school. I have started a project to be in touch with our schools through www.GoodAlumni.com
Pls visit it to see how you can contribute in taking this cause further.
thanks,
Gautam