Sunday, May 17, 2009

చాప్టర్ టూ: మిద్దెల పార్వతి (పాపులర్లీ నోన్ యాజ్ "పారు") - సివంగి ఆఫ్ పెంబర్తి.

పార్ట్ 1
పార్వతి ఆండ్ హర్ ఫ్యామిలీ

మి
ద్దెల పార్వతి - పేరు వింటేనే, ఊర్లో అందరికీ హడల్. వరంగల్ జిల్లా, పెంబర్తిలో పుట్టి పెరిగింది పార్వతి. చెయ్యడానికన్నీ గయ్యాళిచేష్టలయినా, చూడడానికి మాత్రం అందంగా ఉంటుంది. అమ్మ రుక్మనెమ్మ, నాన్న శంకర్ రావు, తాత గణపతయ్య, నానమ్మ పెద్ద పార్వతమ్మ, నలుగురు చిన్నాన్నలు, చిన్నమ్మలు, ఐదుగురు మామయ్యలు ఆండ్ అత్తయ్యలు, వాళ్ల వాళ్ల పిల్లలతో, ఎంతో హడావిడిగా ఉంటుంది వాళ్ల ఇల్లు. తర తరాలుగా వస్తున్న వ్యాపారాలన్నీ దిన దిన ప్రవర్ధమానంగా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా పార్వతి తో బాటుగా ఎదుగుతూ వచ్చాయి. అందువల్ల ఇంట్లో అందరూ పార్వతిని వాళ్ళింటి మహాలక్ష్మి అని, దేవుడిచ్చిన వరమనీ పరమ గారాబంగా పెంచారు. అందరూ ముద్దుగా పార్వతిని 'పారూ' అని పిల్చుకుంటూ ఉంటారు.

పిల్లలందర్లో పెద్దది కావడంచేత, నానమ్మ తాతయ్యల అతి గారాబం చేత, చాలా పెంకిగా తయారయ్యింది పార్వతి. తన మాటకి తిరుగులేదు, తన అల్లరి చేష్టలకి అడ్డు చెప్పేవాడు లేడు. ఊర్లో తన కుటుంబానికి గొప్ప పెరున్డడంచేత ఎవ్వరూ నోరు మెదిపేవారు కాదు. చదువులో కూడా ఎలాగోలా నెట్టుకొచ్చేసింది. జనగాం గవర్నమెంటు ఇంజనీరింగ్ కాలేజీలో పేమెంటు సీట్లో అతి కష్టం మీద అరవయ్ పర్సెంటు తెచ్చేసుకుంది. తాతయ్య గణపతయ్యకు తన మనవరాల్ని పెద్ద డాక్టర్ని చెయ్యాలని ఎంతో ఆశగా ఉండేది. మన పారు చదువులతల్లి కావడంచేత, ఇంజనీరు అయినా ఫరవాలేదు అని సరిపెట్టుకున్నాడు.

ఊర్లోనే ఉంటే ఆకతాయి రారాణి అవుతుందనీ, తాము బతికుండగా పార్వతిని పెళ్లి కూతుర్లా చూడలేమని ఆ తాతయ్యకి దిగులుపట్టుకుంది. ఒక రోజు, పెద్ద పార్వతమ్మ ఇచ్చిన బ్రహ్మాండమయిన ఐడియాకి ఉబ్బి తబ్బిబ్బయిపోయాడు గణపతయ్య. ఒకరోజు, తనకి గుండెనొప్పి వచిందనీ ఏ క్షణాన్నయినా టపా కట్టేస్తాననీ, పోయేలోపు పార్వతి పెళ్లి కళ్ళారా చూసి పోవాలనీ గగ్గోలు పెట్టాడు. ఆయనకి తోడు, ముసలావిడ కూడా వంత పాడింది. ఇదంతా చూసిన శంకర్ రావు, హడావిడిగా తమ ఇంటి బ్రాహ్మడయిన రామనాథ శర్మ గారిని, పెళ్ళిళ్ళ పేరయ్య సిద్ధి రాములు గారినీ వెంటపెట్టుకొచ్చాడు.


టు బి కన్టింయూడ్...

No comments:

Post a Comment