పార్ట్ 2
బంగార్రాజు గోయింగ్ టు హైదరాబాద్!
తన తల్లి పడుతున్న కష్టాలన్నీ దెగ్గర్నిన్చి గమనించాడు కాబట్టి, తాను పెద్దయ్యాక ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించి, తన తల్లిని, తమ్మున్ని, ఇద్దరు చెల్లెల్నీ ఏ లోటూ లేకుండా చూస్కోవాలని గట్టిగా ప్రతిన బూనాడు. ఆ పట్టుదలే, ఆనాడు బంగార్రాజుని బీ.టెక్ చదివించింది, ఫస్ట్ క్లాస్ లో పాస్ చేయించింది. ఈరోజు కాంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయ్యేలా హైదరాబాద్.
లక్కపాలెం పక్కన ఉన్న ఒకానొక్క ఇంజనీరింగ్ కాలేజీకి తన డొక్కు హీరో సైకిల్ వేస్కొని వెళ్ళడం తప్ప, రైలెక్కి వేరే ఊరికెళ్లడం గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. కానీ ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగం మూలాన, తన కుటుంబాన్నిచి దూరంగా ప్రయాణం కావలసోస్తుందని తెగ బాధపడ్డాడు బంగార్రాజు. మంచి ఉద్యోగం వచ్చిందనే సంతోషంకన్నా, తన తల్లిని వదిలి వెళ్ళే ఆలోచనే బంగార్రాజుని కలచివేస్తూంది. ఈ విషయం గురించే ఆలోచిస్తూ, ఇంటి వాకిట్లో ఉన్న నులక మంచం మీద
కూర్చున్నాడు, దిగాలుగా.
బిడ్డ ఆవేదన గమనించిన ఆ తల్లి మెల్లిగా వెళ్లి బంగార్రాజు పక్కన కూర్చుంది. ఎరా నాన్నా! మమ్మల్నొదిలిపెట్టి వేల్లిపోవాలంటే ఎందుకింత ఆలోచన? మంచి ఉద్యోగం సంపాదించాలన్న నీ కల ఇన్నాళ్ళకు తీరినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? బుడి బుడి నడకల నా చిట్టి తండ్రి, చూస్తూ ఉండగానే ఇంత ప్రయోజకుడివయిపోయ్యేనే అని నాకైతే ఊరంతా పూతరేకులు పంచిపెడదామన్నంత ఆనందంగా ఉంది. అయినా నువ్వేమైనా దేశంకాని దేశానికేమైనా పోతున్నావా? మన హైదరాబాదే కదా! వారానికో ఉత్తరం రాస్తా నాయనా, నువ్వు నేలకోమారి మన రెడ్డి గారింటికి ఫోన్ చేద్దువుగాని. ఇంకా ఏమీ ఆలోచించక, పద ఇంట్లోకి. కొడుకు చేతిని తన చేతిలో తీస్కొని ఎంతో ఆప్యాయంగా ముద్దు పెట్టింది. బంగారాజుకి ఇంక ఆగ లేక చిన్నపిల్లాడిలా తన తల్లిని చుట్టేసుకుని వల వలా ఏడ్చేశాడు. ఆ తల్లి సంభాళించుకుని కొంగుతో బిడ్డ కళ్లు తుడిచి, ఒడిలో ఉన్న కొడుకు తల మెల్లిగా నిమురుతూ, పిల్లలు మారాం చేసినప్పుడు తను పాడే పాట అందుకుంది...
సాయంకానికల్లా, బట్టలన్నీ ఇస్తిరీ చేసి, కావలసిన చిన్నా చితకా సామాన్లు, మాగాయ ఆండ్ చింతకాయ పచ్చడి సీసాలూ, హమాం సబ్బూ, పిజియన్ కంపెనీ దువ్వెనా, ప్యారాచూట్ కొబ్బరినూనె సీసా, గత గంగమ్మ జాతరలో కొన్న స్టీలు గ్లాసు, బొంబాయి అద్దం, గట్రా రెడీ చేసేసింది వీర రాఘవమ్మ. బంగార్రాజుకి చాలా ఇష్టమైన కజ్జికాయలూ, మురుకులూ ఎంతో జాగ్రతగా తమ్ముడూ, చెల్లెళ్ళూ కలిసి సరిదిపెడుతుంటే చాలా ముచ్చటేసి అందర్నీ గాఢమ్గా హత్తుకున్నాడు. తల్లినీ చేల్లెల్లనీ ముద్దాడి, అమ్మ పాదాలకు ఇంట్లో ఉన్న తిరుపతి వెంకన్న ఫోటోకి మొక్కి, బస్టాండుకి బయల్దేరాడు.
తమ్ముడు సుబ్బిరాజూ, తనూ సామాన్లు మోసుంకుంటూ, ఇంటి గడప దాటి నాలుగడుగులు వేసారో లేదో, రయ్యిమంటూ తుఫానులా బంగార్రాజు ముందుకొచ్చేసింది, పక్కింటి రెడ్డి గారి ఒకానోక్క గారాల పట్టి, రుక్మిణి. రుక్కు(బంగార్రాజు రుక్మిణిని చిన్నప్పట్నించీ అలానే పిలుస్తుంటాడు) ధాటికి హడలిపొయ్యాడు బంగార్రాజు. చటుక్కున బంగార్రాజు చొక్కా జేబులో ఒక కవర్ పెట్టి తుర్రున పారిపోయింది. ఇదంతా ఏమీ పెద్దగా పట్టించుకోకుండా బస్టాండు వైపు భారంగా అడుగులేసారు మన రాజు బ్రదర్స్.
టు బి కంటిన్యూడ్...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment