పార్ట్ 1
బంగార్రాజు ఆండ్ హిజ్ ఫ్యామిలీ
ఆరడుగుల ఎత్తు, గింగుర్లు తిరిగిన నల్లని ఉంగరాల జుత్తు, హ్రితిక్ రోషన్ లాంటి ఫిగరు, జపాన్ లో బూట్ల కంపెనీ, కోట్ల ఆస్తి; ఇవ్వేవీ బంగార్రాజు గారికి అస్సలు లేవు. కానీ, బంగార్రాజు ఇవ్వన్నీటికంటే చాలా విలువైనదొకటి సంపాదించుకున్నాడు - అదే, బంగారంలాంటి మనస్సు, ఆయన పేరుకు తగ్గట్టు. ఆండ్ ఆఫ్ కోర్స్, హీ ఈజ్ ది వొండ్లీ బీ.టెక్ ఫ్రం లక్కపాలెం, తూర్పు గోదావరి జిల్లా.
ఇక బంగార్రాజు ఫామిలీ గురించి చెప్పుకుంటే, తన చిన్నప్పుడే తండ్రి కాలంచేసాడు. తల్లి వీర రాఘవమ్మ, తమ్ముడు సుబ్బిరాజు, చెల్లెళ్ళు సులోచన ఆండ్ షబానా. (సడన్ గా ఈ షబానా ఏంటి అనుకుంటున్నారా, ఆ కథ వేరేఉంది సో, మరెప్పుడైనా చెబుతా.) మగదిక్కు లేని సంసారాన్ని ఎలాగోలా కష్టపడి, చెమటోడ్చి నేట్టుకోచింది వీర రాఘవమ్మ. తరతరాలుగా వచ్చిన పదెకరాల మాగాణీ, ఐదెకరాల మెట్ట, ఎకరం మామిడి తోటల్ని సాగుకిచ్చో, సేద్యం చేసుకునో, నలుగురు బిడ్డల్ని ఎంతో గారాబంగా పెంచింది. పేరుకి పదహారెకరాలున్నా, చేసే వాళ్లు లేక, కూలీలను పెట్టుకునే స్థోమత లేకపోవడంవల్ల పెద్దగా సంపాదిన్చుకోలేదు.
గిట్టని వాళ్ళనించి భూమిని కాపాడుకుంటూ, పిల్లల్ని చదివించి బుద్ధిమంతులని చేసింది. తనకంటూ ఏ చీరా, నగా కొనుక్కోకుండా, పిల్లలే సర్వస్వంగా ఎంతో శాంతంగా, ప్రేమతో, చిరునవ్వుతో అన్నీ త్యాగంచేసిందా తల్లి. బహుశా బంగార్రాజుకి ఇక్కడినించే అన్ని మంచి బుద్ధులూ వచ్చుంటాయి.
టు బి కంటిన్యూడ్...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment