ఘడియ విరామం లేదు, గవ్వ రాబడి లేదు!
అని ఎవరు అన్నారో కాని, నాకు పక్కాగా సూట్ అయ్యింది. ఒక వారం బెంగళూరు లో మకాం వేస్తే, ఇంకో వారం హైదరాబాదులో తిష్ట. ఈ తిరగడం మూలాన, తత్కాల్ లో ట్రెయిను టికెట్ పెర్ఫెక్టుగా బుక్ చెయ్యడం నుంచి, ప్రైవేటు ట్రావెల్ బస్సుల్లో ఏ సీట్లో తగలడితే, వాడు విన్పించే దిక్కుమాలిన పాటలు ఆ పగిలిపోయిన లౌడ్ స్పీకర్లలో వినబడకుండా నక్కి కుక్కి కూర్చోవడం, ఏ ఆంగిల్ లో వంగితే టీవీ సరిగ్గా కనబడుతుందన్న చెత్త విషయాల్లో నాకు జ్ఞ్యానం బాగా పెరిగింది.
మా దుర్వాసుడు (అనగా మా బాస్ గాడు) చీటికీ మాటికీ వచేసేయ్యి హైదరాబాదుకి అనేస్తాడు, అదేదో కంపెనీ నాకు టిక్కెట్ ఇచ్చి విమానం లో రమ్మన్నట్టు. సీక్రెట్ ఏంటంటే, మా బాసుని తిట్టడం కాదుగాని, నాక్కూడా హైదరాబాదులో ఎప్పుడెప్పుడు వాలిపోదామనే ఉంటుంది.
Wednesday, April 29, 2009
Subscribe to:
Post Comments (Atom)
సరైన ప్రత్యమ్నయమ్ - రెపు పొద్దున ట్రవెల్ ఎజెన్సి పెటుకొవచ్చు - ఐతె ఎపుడు వస్తున్నవు?
ReplyDelete